హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం'

SKLM: నరసన్నపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రమణమూర్తి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నరసన్నపేటలోని స్థానిక పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.