హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీ ఆశయాలను ఆచరించాలి: RDO

KRNL: ఆదోని RDO కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో కె. అరుణాదేవి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, బాధ్యతాయుత పౌరులుగా సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.