హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడా పోటీలను ప్రారంభించిన బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ఘనంగా ప్రారంభించారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారికి సహాయ సహకారాలు అందజేస్తామని బీసీ ఇందిరమ్మ అన్నారు. అనంతరం వాలీబాల్ పోటీలలో గెలుపొందిన వారికి ఆమె బహుమతులను అందజేశారు.