హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గాంధీ, శాస్త్రి ఆశయాలతో సేవలందించాలి'

GNTR: గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఐలు టీ. బాలశంకరరావు, బీవీ. సుబ్బారెడ్డి, ఎంవీ. సుబ్బారావు, జి. రాజారత్నం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, దేశభక్తి, క్రమశిక్షణ, నిరాడంబరత వంటి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు.