హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీ ఆశయాలను అందరూ ఆచరించాలి: MLA

TPT: వెంకటగిరిలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణ గ్రంథాలయం వద్ద గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.