హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

TPT: పిచ్చాటూరు మండలం బంగాళా గ్రామంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి జ్యోతి ఆధ్వర్యంలో గ్రామసభనిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ప్రజల సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.