హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన హబ్‌తో రైతులకు కొత్త అవకాశాలు

NDL: డోన్ మండలం యు.కొత్తపల్లిలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి వీక్షించారు. రాయలసీమను ఉద్యాన రంగంలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఇది కీలక అడుగని అన్నారు. ఆధునిక సాంకేతికత, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. రైతుల ఆదాయం పెంపునకు అవసరమైన సహకారం అందిస్తానని తెలిపారు.