హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం..!

KDP: శంషాబాద్‌ నుంచి కడపకు బయలుదేరిన ఇండిగో విమానంలో కలకలం చోటుచేసుకుంది. విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని RGIA పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో విమానంలోని ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.