PLD: జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, సేవా స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ఏఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీ, ఆర్‌ఐ గోపీనాథ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు


