KNR: "గాంధీజీ అహింసా మార్గం మనకు ఆదర్శం" అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో 157వ గాంధీ జయంతి సందర్భంగా బాపూజీ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. మార్కెట్ ఛైర్మన్ ఆకుల నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ సూడా ఛైర్మన్ నరేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
గాంధీజీ అహింసా మార్గం మనకు ఆదర్శం: ఎమ్మెల్యే


