హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 120 మంది లబ్ధిదారులకు రూ.68.12 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.