హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామ అభివృద్ధి తోనే రాష్ట్రం పురోగతి సాధ్యం: గోరంట్ల

తూ.గో: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల మెరుగుదలతో పాటు వైద్యం, విద్య రంగాల్లో సదుపాయాలు కల్పిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.