హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

KRNL: ఆదోనిలో తొలిసారిగా 41వ ఏపీ స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026 ఘనంగా ప్రారంభమైంది. జిల్లా అథ్లెటిక్స్ ఛైర్మన్ మారుతి ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. డీఎస్పీ, ఆర్డీవోలు హాజరై జాతీయ జెండాకు వందనం చేశారు. వివిధ జిల్లా క్రీడాకారులు ఉత్సాహంగా మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు.