హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుంటూరు పార్కులో మందుబాబుల రచ్చ

గుంటూరు డొంకరోడ్డులోని వెల్ఫేర్ సెంటర్ పార్కులో రాత్రివేళల్లో కొందరు మందుబాబులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల అభివృద్ధి చేసిన ఈ పార్కుకు వాకింగ్ కోసం వచ్చే పెద్దలకు, పిల్లలకు చీకటి పడిన తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా పార్కులో స్వచ్ఛభారత్ నిర్వహించిన స్థానికులు, ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.