హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దాపురంలో సీపీఎం నిరసన

కాకినాడ: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిలిపివేయాలని, ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ పెద్దాపురంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నాయకులు తమ డిమాండ్లను వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు.