హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టులకు ప్రభుత్వం అండ: మంత్రి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నాయకులు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిశారు. జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.