హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గాంధీజీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం'

E.G: గాంధీజీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దానవాయిపేట, కంబాల చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని గాంధీజీకి ఘన నివాళులర్పించారు. అహింస, శాంతి, సత్యం, ప్రజాస్వామ్య విలువలను గాంధీజీ ప్రపంచానికి అందించిన గొప్ప సందేశాలని కొనియాడారు.