హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంగన్వాడీలకు వేతనం పెంచాలి'

SKLM: అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా రణస్థలం మండలం కొండములగంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. 2019 నుంచి వేతనాలు పెరగలేదని, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. హామీలు అమలు చేయకుంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.