హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో మాంసం అమ్మకాలు

NTR: నందిగామలోని భారత టాకీస్ సెంటర్ వద్ద గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలు జరిగాయి. అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టినా, వ్యాపారులు తమ స్వలాభం కోసం నిబంధనలను ఉల్లంఘించారు. రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని వ్యాపారులు బహిరంగంగా చెప్పడంతో అధికారులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. మహాత్మా గాంధీకి ఇది ఘోర అవమానమని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.