కృష్ణా: గన్నవరం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ గా కె. జయకృష్ణ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన చలసాని శ్రీనివాస్ నందిగామకు బదిలీ కాగా, నాలుగు నెలలుగా ఎయిర్‌పోర్ట్ డీఎస్పీ ధర్మేంద్ర ఇంఛార్జిగా వ్యవహరించారు. సాధారణ బదిలీలలో భాగంగా వచ్చిన జయకృష్ణ, శాంతిపరిరక్షణే తన ధ్యేయమని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలకైనా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
గన్నవరం డిఎస్పీగా జయకృష్ణ బాధ్యతలు


