హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: హత్య కేసును ఛేదించిన పోలీసులు

ELR: జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెంలో ఇటీవల జరిగిన పిల్లెం వెంకయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన తల్లితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆగ్రహంతో అదే గ్రామానికి చెందిన బొమ్మ అజయ్ గొడ్డలితో నరికి వెంకయ్యను దారుణంగా హత్య చేసినట్లు సీఐ బి. యాదగిరి వెల్లడించారు. సమగ్ర విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశామని, కోర్టులో హాజరుపరచనున్నామని తెలిపారు.