GNTR: తెనాలి కూరగాయల మార్కెట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి నాదెండ్ల మనోహర్ పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన అహింసా మార్గం, ప్రజాసేవ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రజలకు చేరేలా చూడటం ప్రజాప్రతినిధుల బాధ్యతన్నారు. ప్రజల అవసరాలు గుర్తించి, పారదర్శకతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీజీ ఆశయాలతో ప్రజాసేవకు ప్రాధాన్యత: నాదెండ్ల


