హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ సిబ్బందికి కవాతుపై శిక్షణ

ELR: దెందులూరు జడ్పీ హైస్కూల్ ఆవరణలో పోలీస్ సిబ్బందికి కవాతు, ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. పెదవేగి సీఐ సిహెచ్. రాజశేఖర్ పర్యవేక్షణలో ఎస్సై వెంకట కుమార్ సిబ్బందితో కవాతు చేయించి, దేహదారుఢ్యం, మనోస్థైర్యంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం కేసుల దర్యాప్తులో పాటించాల్సిన చట్టపరమైన, సాంకేతిక మెలకువలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.