హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గాంధీజీ అడుగుజాడల్లో నడవడమే నిజమైన నివాళి'

మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్ద గల గాంధీ పార్కులో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పీ. శ్రీనివాసులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని కలెక్టర్ సూచించారు.