హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'చాపరాయికి పోటెత్తిన పర్యాటకులు'

ASR: డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతానికి ఇవాళ పర్యాటకులు భారీగా తరలివచ్చారు. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా నాలుగు రోజులుగా జలపాతాన్ని మూసివేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో తిరిగి సందర్శకులను అనుమతించడంతో పర్యాటకుల సందడి నెలకొంది. ఆహ్లాదకర వాతావరణంలో సరదాగా గడిపారు.