హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ వేధింపులు తాళలేక గ్రానైట్ క్వారీ మూసివేత

ప్రకాశం: ప్రభుత్వ వేధింపులు, రాజకీయ కక్షసాధింపులు తాళలేక గ్రానైట్ క్వారీని మూసివేస్తున్నట్లు దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. కార్మికుల బకాయిలను పూర్తిగా చెల్లించిన అనంతరం క్వారీని మూసివేసినట్లు చెప్పారు. దీంతో సుమారు 350 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని, ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవాలని సూచించారు.