హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆసుపత్రిలో గాంధీ జయంతి

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కే. వెంకటేశ్వర్లు క్యాజువాల్టీ ఎదుట గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డా. లక్ష్మీభాయ్, వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.