హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో గాంధీ జయంతి వేడుకలు

PLD: నరసరావుపేటలో వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం, కోట సెంటర్‌లోని గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.