హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో జర్నలిస్టుల డిమాండ్స్ డే

ప్రకాశం: గిద్దలూరులో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు తమ సమస్యలు, డిమాండ్లపై తహసీల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు జర్నలిస్టులు పాల్గొన్నారు.