KRNL: పత్తికొండ నియోజకవర్గంలోని పత్తికొండ, తుగ్గలి, మద్దికేర, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ఎమ్మెల్యే శ్యాంకుమార్ చొరవతో ఈ ప్రకటన సాధ్యమైందని తెలిపారు. కరువు ప్రకటనతో పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, అదనపు ఉపాధి హామీ పనులు అందే అవకాశం ఉంది. ప్రకటనపై రైతులు, హర్షం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో కరువు మండలాలు ఇవే..!


