హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీకి నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్

TPT: గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్‌లో మహాత్మా గాంధీ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, డీఆర్వో నరసింహులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.