హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొక్కలు నాటిన ఎమ్మెల్యే గౌరు

కల్లూరు అర్బన్ 29వ వార్డులోని వీవీఎస్ ఫంక్షన్ హాల్‌లో ‘సేవా మేరా–యోగ్‌దాన్’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ చల్లా ఓబులేసు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.