ASR: పెదలబుడు, పద్మాపురం, వాలసికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారన్న ప్రచారంలో వాస్తవం లేదని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం తెలిపారు. టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. వారికి వైసీపీతో సంబంధం లేదని, గత ఎన్నికల్లో వారు కాంగ్రెస్ మద్దతుదారులని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలతో వైసీపీకి ఉన్న ప్రజాదరణను తగ్గించలేరన్నారు.
ఆంధ్రప్రదేశ్
'టీడీపీ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి'


