W.G: ఇరగవరం మండలం అయినపర్రు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కర్రి మోహన్‌రెడ్డి (15) శుక్రవారం కాలువలో పడి గల్లంతయ్యాడు. కాకిలేరు సమీపంలోని నరసాపురం కాలువలో కాళ్లు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయినట్లు సమాచారం. మోహన్‌రెడ్డి స్థానిక స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
కాలువలో పడి విద్యార్థి గల్లంతు


