హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

KDP: బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను కమిషనర్ ఎం.కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్రపటాలకు, మైదుకూరు రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కమిషనర్ సూచించారు.