సత్యసాయి: ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ భూమి పూజ కార్యక్రమానికి అక్టోబర్ 5న కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హాజరుకానున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారా లోకేష్, సవిత కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరానికి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ రాక


