హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం'

VZM: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ శిరోధార్యమని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి, దేశ మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ పాల్గొన్నారు.