WG: పాలకొల్లుతో పాటు జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో విలీన గ్రామాలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పాలకొల్లు పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. దీంతో అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించే అవకాశం ఉంది. వార్డుల విభజనకు సమయం పట్టే అవకాశం ఉండటంతో పాలకొల్లులో రెండో విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లు మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం


