హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహణ

GNTR: తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చందు సాంబశివుడు మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరంలో మహాత్మా గాంధీ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.