హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులకు రాయితీపై చాప్ కట్టర్లు'

SKLM: కోటబొమ్మాలి మండలంలో రైతులకు రాయితీపై గడ్డి కత్తిరింపు యంత్రాలు అందిస్తున్నట్లు నిమ్మాడ పశు వైద్యాధికారి ఇవాళ తెలిపారు. 3 హెచ్‌పీ,3 బ్లేడ్ యంత్రం ధర రూ.40,500 కాగా 50 శాతం రాయితీతో రూ.20,250కు, 2హెచ్‌పీ యంత్రం రూ.33,970 కాగా 40 శాతం రాయితీతో రూ.20,382కు లభిస్తుందన్నారు. ఆసక్తి గల రైతులు సమీప పశువైద్యశాలలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.