హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గాంధీ స్ఫూర్తితో స్వరాజ్యానికి కృషి: మంత్రి

కృష్ణా: మచిలీపట్నంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ సమీపంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చారు. గాంధీజీ చూపిన అహింసా మార్గంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు.