కృష్ణా: పెడన మండలం లంకలకలవగుంట, బంటుమిల్లి మండలం కంచడం ఆయకట్టులోని పంట పొలాల మురుగునీరు చేరడంతో శివకోడు కాలువ గుర్రపుడెక్కతో నిండిపోయింది. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మురుగునీటి ప్రవాహం నిలిచిపోయి పొలాల్లో నీరు నిలిచిపోతోందని రైతులు తెలిపారు. కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించి మురుగునీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుర్రపుడెక్కతో మూసుకుపోయిన శివకోడు కాలువ


