హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో చీపురు పట్టిన మంత్రి

సత్యసాయి: ధర్మవరంలో జరిగిన స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమని తెలిపారు. వికసిత భారత్ లక్ష్యంతో ప్రధాని మోదీ పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా మార్చారని పేర్కొన్నారు. ప్రజలు, అధికారులు సమష్టిగా కృషి చేసి ధర్మవరాన్ని 'స్వచ్ఛ ధర్మవరం'గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.