కోనసీమ: మండపేటలో ఏపీ యూ డబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కోరికల దినం నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. హౌసింగ్, హెల్త్ స్కీమ్, పెన్షన్, యాక్సిడెంటల్ పాలసీ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోసూరి అప్పారావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం


