హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

KL యూనివర్సిటీలో ఘోర అగ్నిప్రమాదం

గుంటూరు: తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని KL యూనివర్సిటీ 5వ అంతస్తు లైబ్రరీలో గురువారం రాత్రి 8 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది త్వరితగతిన చేరుకుని మంటలను అదుపు చేశారు.