హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో రోడ్డు ప్రమాదం

బాపట్ల జిల్లా వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిపై తిమ్మరాజుపాలెం గ్రామం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు అక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పర్చూరు ఎస్సై అంకమ్మరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.