హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్య కేసులో అనుమానితుడి ఫోటో విడుదల

PLD: నరసరావుపేట కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్‌లో బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్న వ్యక్తిని రాయితో కొట్టి హత్య చేసిన కేసులో గుర్తుతెలియని నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానితుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతను ఎడమ కాలుతో కుంటుతూ నడుస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ లేదా సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.