హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగ్గంపేటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

కాకినాడ: జగ్గంపేటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు హాజరై గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు పంపిణీ చేసి, గాంధీజీ చూపిన మార్గాన్ని అనుసరించాలన్నారు.