హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోనసీమ కొబ్బరి ధరకు రెక్కలు

కోనసీమ: పండుగల సీజన్‌తో కోనసీమ జిల్లాలో కొబ్బరికాయల ధరలు పెరిగాయి. గతంలో రూ.16 వేల నుంచి రూ.17 వేలుగా ఉన్న ధర ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.22 వేలకు చేరింది. విజయదశమి, దీపావళి పండుగల నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.