AKP: సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ డిమాండ్ చేశారు. అడ్డరోడ్డు తిమ్మాపురంలో గాంధీజీ జయంతి నిర్వహించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓటు హక్కును హరించే చర్యలు నిలిపివేయాలని కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సీఈసీ జ్ఞానేశ్వర్ ను పదవి నుంచి తొలగించాలి'


